మణుగూరు సింగరేణి సంస్థకు చెందిన ఇనుమును అపహరించేందుకు మంగళవారం గాంధీనగర్లో కొందరు మహిళలు ప్రయత్నించారు. అనుమానాస్పదంగా ఐరన్ను తరలిస్తున్న వారిని సెక్యూరిటీ సిబ్బంది చాకచక్యంగా గమనించి, అప్రమత్తమై అడ్డుకున్నారు. సదరు మహిళలను అదుపులోకి తీసుకుని, వారి వద్దనున్న సింగరేణి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.