హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద కండక్టర్ ప్రవళిక పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రవళిక తల్లిని పరామర్శించి, ఆర్టీసీ కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం, ఆర్టీసీ తరపున రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా, అలాగే ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బ్యాంకు నుండి రూ. కోటి ప్రమాద బీమా అందజేయనున్నట్లు పేర్కొన్నారు.