బూర్గంపాడు ఎంపీడీవో కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించారు. రూ. 7. 80 వేలు విలువైన CMRF చెక్కులను 18 మందికి, గతంలో పెండింగ్‌లో ఉన్న 30 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో MPO రామకృష్ణ, హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్, మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా
కాంగ్రెస్ కార్యదర్శి, గ్రామ అధ్యక్షుడు తిరుపతి, చంటి పాల్గొన్నారు.