మణుగూరు కరాటే మాస్టర్లను సత్కరించిన ఎమ్మెల్యే

9చూసినవారు
మణుగూరు కరాటే మాస్టర్లను సత్కరించిన ఎమ్మెల్యే
గ్లోబల్ స్థాయిలో అవార్డులు సాధించిన మణుగూరు కరాటే మాస్టర్లను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించి అభినందించారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ 4వ డాన్ సాధించిన కాసిమల్ల పద్మకు 'గ్లోబల్ మాస్టర్ అవార్డు', బ్లాక్ బెల్ట్ 1వ డాన్ పొందిన గుగులోత్ రిషికకు 'గ్లోబల్ స్టార్ కిడ్ అవార్డు' లభించాయి. ఈ సందర్భంగా మణుగూరు క్యాంపు కార్యాలయంలో వారిని అభినందించిన ఎమ్మెల్యే, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి మణుగూరు పేరు నిలబెట్టడం గర్వకారణమని కొనియాడారు. క్రీడల్లో యువత మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్