లారీ ఢీకొని ఒకరు మృతి.. నలుగురికి గాయాలు

11చూసినవారు
లారీ ఢీకొని ఒకరు మృతి.. నలుగురికి గాయాలు
బూర్గంపాడు మండలం సారపాక నుంచి పాల్వంచ వెళ్తున్న ఆటోను శ్రీరాంపురం వెస్ట్‌గేట్ వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పినపాక మండలం టి. కొత్తగూడెంకు చెందిన వడ్డే వెంకటేశ్వర్లు(55) మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. గద్దల శివకుమార్(33)కు చెయ్యి, కాలు ఫ్యాక్చర్లు, ఆటో డ్రైవర్‌కు తలకు, చేతికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్