తుఫాను ప్రభావంతో పినపాక మండల వ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లింది. ఏడూళ్ల బయ్యారం, పాత రెడ్డిపాలెం, పినపాక గ్రామాల్లో ఈదురుగాలులకు వరి పంట నేలకొరిగింది. దిగుబడి సమయంలో పంట దెబ్బతినడం, కోతకు వచ్చిన పంట నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ధాన్యం కొనుగోలు సమయంలో అధికారులు సహకరించాలని వారు కోరుతున్నారు.