అశ్వాపురం మండలంలోని తుర్రం వారిగూడెం గ్రామానికి చెందిన జర్పుల సువాలి (60) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతు నులిమి హత్య చేసి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు