పంచాయతీ కార్యాలయం ఎదురుగా నిరసన

1చూసినవారు
పంచాయతీ కార్యాలయం ఎదురుగా నిరసన
మణుగూరు మండలం ముత్యాలమ్మ నగర్ పంచాయతీ పరిధిలో, జనావాసాల మధ్య అక్రమ సెల్ టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా పంచాయతీ సొంత పాలక వర్గ సభ్యులు, వార్డ్ మెంబర్స్ గుంటక వెంకటేశ్వర్లు, కొమరం భూపతి పంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. పాలక వర్గ సమావేశం, గ్రామ సభ, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా సెల్ టవర్ నిర్మాణ పనులను అడ్డగించకుండా జరిగిన జాప్యంపై వారు అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సర్పంచ్ ప్రజాభిష్టానికి అనుకూలంగా స్పందించి సెల్ టవర్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్