బూర్గంపహాడ్ మండలం సారపాక రాజీవ్‌నగర్‌కు చెందిన షేక్ ఆయేషా పర్వీన్ అనే 9 ఏళ్ల బాలిక వైద్య చికిత్స కోసం ముస్లిం ఎంపవర్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా) రూ. 10 వేల ఆర్థిక సాయం అందించింది. ఇంట్లో ఆడుకుంటూ పడిపోవడంతో బాలిక కాలు విరిగి శస్త్రచికిత్స అవసరమైందని, కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ సాయం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేవా అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా, సభ్యులు పాల్గొన్నారు.