మణుగూరు గనిని సింగరేణికే కేటాయించాలని వినతి

78చూసినవారు
మణుగూరు గనిని సింగరేణికే కేటాయించాలని వినతి
మణుగూరు పీకే ఓసీ డీప్ సైడ్ ఓపెన్‌కాస్ట్ గనిని సింగరేణి సంస్థకే కేటాయించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎంపీ బలరాం నాయక్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. గనిని జెన్‌కోకు కాకుండా సింగరేణికి దక్కేలా చూడాలని విన్నవించారు. దీనివల్ల వేలాది మంది కార్మికుల ఉపాధి భద్రతతో పాటు సంస్థకు రూ. 1,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని వివరించారు. స్పందించిన మంత్రి సానుకూల చర్యలకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్