సారపాక–మణుగూరు R&B రోడ్డును వెంటనే నిర్మించాలి

1చూసినవారు
పినపాకలో సారపాక–ఇరవెండి–మణుగూరు R&B రోడ్డును వెంటనే నిర్మించాలని సీపీఎం బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వర్షాల కారణంగా రోడ్డు దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం, R&B అధికారులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్