తుమ్మల చెరువుకు సీతారామ జలాలు విడుదల

2చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం బిజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న తుమ్మల చెరువుకు నీరు చేరడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్