పొదెం వీరయ్య బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ ఖండించారు. నాలుగు దశాబ్దాలుగా వీరయ్య కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధార ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారాన్ని నమ్మవద్దని కాంగ్రెస్ శ్రేణులు ప్రజలను కోరారు.