రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

8చూసినవారు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి
తల్లాడలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన గోసు కళావతి (40) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కల్లూరు మండలం పాయపూర్ గ్రామానికి చెందిన కళావతి, తల్లాడలో వ్యవసాయ పనులు ముగించుకొని ఆటో కోసం ఎదురుచూస్తుండగా, అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడటంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్సలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.