ఖమ్మం: ఈరోజు విడుదలైన పదో తరగతి (SSC) ఫలితాల్లో సర్వజ్ఞ
విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేసింది. ప్రతి ఏటా లాగే ఈ ఏడాది కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించి తమ విజయ పరంపరను కొనసాగించారు.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ శ్రీ ఆర్.వి. నాగేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ.. "విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల నిరంతర కృషి మరియు తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైందని" ఆనందం వ్యక్తం చేశారు. మా పాఠశాల నుండి పరీక్షకు హాజరైన విద్యార్థులందరూ వంద శాతం ఉత్తీర్ణులయ్యారు. టాప్ స్కోరర్లు: కె. హ్రిషికేశ్ -590, సి.హెచ్. వేంకట రంగ దీక్షిత- 588, ఎల్. అర్షియా ఖాన్ – 584, సి.హెచ్. సాయి హితేష్ కుమార్ -575, బి. యశస్విని -572, వాసిరెడ్డి కృష్ణ -557, ఎన్. హర్షిత -551, పి. వేదవర్షిత్ -547, ఎస్. అభిషేక్ రెడ్డి -545, పి. సనా రెడ్డి -544, డి. హన్సిత -542 మార్కులు సాదించారు.
పరిమిత సంఖ్యలో విధ్యార్ధులతో కేవలం ఇంతటి ఉత్తమ పలితాలు సాధించి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ స్థానాలలో నిలవడం గర్వకారణంగా వుందని చైర్మన్ ఆర్.వి. నాగేంద్ర కుమార్ గారు తెలిపారు. నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు 60% మంది విద్యార్ధులు 500 పైగా మార్కులు సాధించారని డైరెక్టర్ నీలిమ గారు తెలిపారు. ఇంతటి విజయాలు సాధించిన విధ్యార్ధులను, అధ్యాపకులను, అధ్యాపకేతర సిబ్బందిని అభినందించారు.