
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయాలి
నిరుద్యోగ సమస్య పరిష్కారం, కోసం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 20న ఖమ్మం కలెక్టరేట్ లో మహాధర్నా ను విజయవంతం చేయగలనీ, సీపీఎం నేతలు మాదినేని రమేష్, శీలం సత్యనారాయణ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. ఆదివారం సత్తుపల్లిలోని దొడ్డ కృష్ణయ్య భవనంలో, సిపిఎం మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగులకు రూ. 5వేలు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.






































