కల్లూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సభ్యులు నామినేషన్లు దాఖలు చేయడానికి వీలుగా బత్తులపల్లి, చండ్రుపట్ల, లింగాల, వెంకటాపురం, కొర్లగూడెం, చిన్న కోరుకొండి, పోచారం, చెన్నూరు, పెద్ద కోరుకొండి, ముచ్చవరం గ్రామాలలో నామినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. సరైన పత్రాలతో నామినేషన్లు దాఖలు చేయాలని ఆయన సూచించారు.