జాలర్లను కాపాడేందుకు వెళ్లి 10 మంది గల్లంతు

1చూసినవారు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిలో భారీ వర్షాలకు చెరువు అలుగు పారుతుండగా చేపలు కొట్టుకొని పోకుండా నెట్లు ఏర్పాటు చేసేందుకు వెళ్లి ఐదుగురు జాలర్లు వరదలో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు వెళ్ళిన ముగ్గురు ఫైర్ సిబ్బంది బోటు సమస్యకు గురైంది. అనంతరం సహాయక చర్యల కోసం కొత్తగూడెం ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది వెళ్లి బోటులో చిక్కుకున్న ముగ్గురు సిబ్బందిని తీసుకొచ్చారు. అనంతరం జాలర్ల కోసం రెండు బోట్లలో వెళ్లగా అవి పల్టీ కొట్టడంతో అందులోని మొత్తం 10 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కలెక్టర్ దివాకర్, ఎమ్మెల్యే మట్టా రాగమయి అక్కడకు చేరుకున్నారు. డ్రోన్ల సాయంతో లైఫ్ జాకెట్లు పంపేందుకు యత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్