తల్లాడ మండలం పినపాక గ్రామంలో కామ్రేడ్ నల్లమోతు పిచ్చయ్య 37వ వర్ధంతిని శనివారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సింగు నరసింహారావు మాట్లాడుతూ, వైరా కాలువ సాధనతో పాటు పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించడంలో పిచ్చయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువత ఆయన పోరాట స్ఫూర్తితో ప్రజా హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తాటి వెంకటేశ్వరరావు, పావులూరి మల్లికార్జున్, నిమ్మటూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.