అంగన్వాడీ వర్కర్లకు ఘన సన్మానం

5చూసినవారు
అంగన్వాడీ వర్కర్లకు ఘన సన్మానం
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా తల్లాడ పట్టణంలో అంగన్వాడీ వర్కర్లను ఘనంగా సన్మానించారు. మండల అధ్యక్షుడు చల్లా నాగులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ నంబూరి రామలింగేశ్వరరావు హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యతో పాటు గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పిస్తూ కీలక సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్