సత్తుపల్లిలో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు

3చూసినవారు
సత్తుపల్లిలో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు
సత్తుపల్లి పుర కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగినట్లు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలోని బృందం కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, పలు కీలక అంశాలపై సమాచారం సేకరించి, స్టేట్మెంట్లను రికార్డు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

ట్యాగ్స్ :