సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

0చూసినవారు
సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. మున్సిపల్ కమీషనర్, సిబ్బందిని ఏసీబీ డిఎస్పీ వై. రమేష్ విచారిస్తున్నారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగినట్లు సమాచారం. కార్యాలయంలోని వ్యక్తులను బయటకు రానివ్వకుండా గేట్ల వద్ద కానిస్టేబుళ్లు గస్తీ కాస్తున్నారు. తనిఖీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :