బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

9చూసినవారు
బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం
ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలోని తల్లాడలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ పెరిక నాగేశ్వరావు, బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి, వార్డు సభ్యుడు షేక్ కమల్ పాషా, పద్మశాలి సంఘం సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్