మురసు తుఫాను కారణంగా తల్లాడ మండలంలో దెబ్బతిన్న వరి, పత్తి, మిర్చి పంటలను
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు అన్నారుగూడెం, బిల్లుపాడు, వెంగన్నపేట, మిట్టపల్లి గ్రామాల్లో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేల పరిహారం చెల్లించాలని, తల్లాడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి పొలంలో పంట నష్టాన్ని అధికారులు పారదర్శకంగా అంచనా వేయాలని కోరారు. రైతులకు బీమా పరిహారం అందేలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్ చేశారు.