సీపీఎం నేత షేక్ అబ్బన్న మృతి: జిల్లా నేతల నివాళి

1185చూసినవారు
బుధవారం కల్లూరు మండల పరిధిలోని పెద్ద కోరుకోండి గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నేత షేక్ అబ్బన్న గుండెపోటుతో మరణించారు. ఈ వార్త తెలుసుకున్న సీపీఎం జిల్లా నేత మాదినేని రమేష్, అబ్బన్న భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాల వేసి, ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. అబ్బన్న సిద్ధాంతాలకు కట్టుబడిన ఉత్తమ కమ్యూనిస్టు అని, ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని రమేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాతా భాస్కరరావు, మాదాల వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :