ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో స్వర్ణిక దివ్యాంగుల సేవా ఆశ్రమం వారు వెంగల్ రావు నగర రోడ్ నంబర్ 8 ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలకు పలకలు, స్నాక్స్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వలపర్ల రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నోట్‌బుక్‌ల అవసరం ఉందని, దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం చేసి వారి చదువుకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.