తల్లాడ మండలంలోని మల్లవరం గ్రామంలో పొలాలకు వెళ్లే ఊటవాగు రహదారి, బ్రిడ్జి నిర్మించాలని గ్రామ రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ రహదారిలో నిత్యం వందలాది మంది రైతులు వ్యవసాయ పనులకు వెళ్తున్నారని, పోలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.