
దేశవ్యాప్తంగా ప్రారంభమైన 'జల్ దూత్' సర్వే
దేశవ్యాప్తంగా భూగర్భ జలాల లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 'జల్ దూత్' మొబైల్ యాప్ ద్వారా బావుల్లో నీటి మట్టాల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించింది. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ సర్వే జూన్ 15 వరకు కొనసాగుతుంది. గ్రామాల్లోని ఎంపిక చేసిన బావుల వద్దకు వెళ్లి, ప్రస్తుత నీటి మట్టాన్ని కొలిచి, ఆ వివరాలను యాప్లో నిక్షిప్తం చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ డేటా భవిష్యత్తులో నీటి ఎద్దడి నివారణకు కీలక పాత్ర పోషించనుంది.




