సత్తుపల్లిలో సాయంత్రం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీనితో పట్టణంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వేసవి తాపంతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్నిచ్చింది. వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వాహనాల రాకపోకలు కూడా కాసేపు స్తంభించాయి.