సత్తుపల్లి పర్యటనలో మంత్రి పొంగులేటి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ వెనుక రూ. లక్ష కోట్ల కమీషన్ల కక్కుర్తి దాగి ఉందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన వారే ఇప్పుడు అక్కడ పర్యటిస్తూ రిపేర్లపై మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రజల ధనాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రివర్గాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.