సత్తుపల్లిలోని పీఎంశ్రీ ఎంపీపీఎస్ పాఠశాలలో బుధవారం మున్సిపల్ ఛైర్మన్ రెహానా కమల్ పాషా, ఎంఈఓలు జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న నాణ్యమైన విద్యను, వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.