కల్లూరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బత్తులపల్లి గ్రామానికి చెందిన బొల్లిపోగు గురవయ్యకు రాష్ట్ర
కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ నివాళులర్పించారు. కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉన్న గురవయ్య పార్థివదేహానికి పూలమాల వేసి, కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ధారావత్ మోహన్ నాయక్, ఏఎంసీ చైర్మన్ బాగం నీరజా ప్రభాకర్ చౌదరి,
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.