కల్లూరు: దివ్యాంగులకు రెండు ట్రై సైకిళ్లు పంపిణీ

6చూసినవారు
కల్లూరు: దివ్యాంగులకు రెండు ట్రై సైకిళ్లు పంపిణీ
కల్లూరు మండలం మర్లపాడు గ్రామ సర్పంచ్ రాచబంటి చిన్నకృష్ణయ్య గురువారం గ్రామానికి చెందిన ఇద్దరు దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను తన సొంత ఖర్చులతో అందజేశారు. ఉప సర్పంచ్ సీతారామరాజు, వార్డు సభ్యుల సమక్షంలో మాజీ జెడ్పిటిసి కట్టా అజయ్ కుమార్ చేతుల మీదుగా ఈ ట్రై సైకిళ్లను దివ్యాంగులకు అందించారు. సర్పంచ్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీరయ్య కూడా పాల్గొన్నారు.