కల్లూరు: పల్లె ప్రకృతి వనం.. గొర్రెల పాలైన వైనం

1354చూసినవారు
హరిత తెలంగాణ లక్ష్యంతో ప్రభుత్వం లక్షల ప్రజాధనంతో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ లోపంతో నాశనమవుతున్నాయి. కల్లూరులో సరైన రక్షణ లేక పశువులు, మేకలు, గొర్రెలు వనాల్లో స్వేచ్ఛగా సంచరిస్తూ చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. వనాల్లో చెట్లు ఎండిపోయి, పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయాయి. అధికారులు స్పందించి, వనాల లక్ష్యాన్ని నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్