కల్లూరు మండలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణాలను ప్రారంభించి పూర్తిచేయాలని కల్లూరు RDO రాజేందర్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని వాచ్యానాయక్ తండ, చిన్న కోరుకొండి, పెద్ద కోరుకొండిలో ఇళ్లను సూపర్ చెక్ ద్వారా పరిశీలించారు. 4 దఫాలుగా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు మంజూరు అవుతాయని చెప్పారు. నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు.