జల్సాల కోసం ఇల్లు అమ్మేందుకు అడ్డువచ్చాడని కన్నకొడుకు కిరణ్ కుమార్‌ను రోకలిబండతో మోది హత్య చేసిన కల్లూరు పట్టణం, అంబేద్కర్ కాలనీకి చెందిన కొత్తపల్లి సీతారాములును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 3న కొడుక్కి మద్యం తాపించి, నిద్రపోయాక తలపై కొట్టి చంపాడు. అనంతరం ఆటోలో పరారైన నిందితుడిని సోమవారం ముగ్గు వెంకటాపురం వద్ద పట్టుకుని ఆటో, రోకలిబండ, కత్తిని సీజ్ చేసినట్లు సత్తుపల్లి రూరల్ CI తెలిపారు. నిందితుడిని కోర్టులో రిమాండ్ చేయనున్నారు.