కల్లూరు మండలం లోకవరంలో మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ సబ్ స్టేషన్ ప్లాంట్ ను విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసచారి, సత్తుపల్లి ఆపరేషన్ డివిజన్ డీఈ ఎల్. రాములు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా గ్రామంలో పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఎస్ఈ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. డివిజన్ పరిధిలో విద్యుత్ లైన్ల ఆధునీకరణ పనులు జరుపుతున్నామన్నారు. కల్లూరు ఏఈ పి వెంకట్ తదితరులు ఉన్నారు.