హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని రాజ్యసభసభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. కల్లూరులో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన పార్టీ ముఖ్య నాయకులు సమావేశంలో ఆయన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ సభ సందర్భంగా గ్రామగ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించాక ఎల్కతుర్తి బయలుదేరాలని కోరారు.