తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్ల యూనియన్ (ఎఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నర్సింహ, ప్రభుత్వ ఆస్పత్రి కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు పెంచాలని, లేదంటే సమ్మె చేస్తామని హెచ్చరించారు. కల్లూరులో జరిగిన యూనియన్ జిల్లా ప్రథమ మహాసభలో ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. కనీస వేతన బోర్డు సిఫారసు చేసి ఏడాది గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.