ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం కల్లూరు మండలం పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్య తగ్గడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పెండింగ్‌లో ఉన్న ప్రహారీ గోడ పనులతో సహా అన్ని పనులను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. తాను మళ్లీ వచ్చేసరికి పనులు పూర్తి కావాలని గడువు విధించారు.