తొమ్మిది నెలల జీతాలు విడుదల చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్న కల్లూరు మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, కమిషనర్ సీహెచ్ రాజశేఖర్ ఇచ్చిన హామీతో బుధవారం సమ్మెను విరమించారు. చైర్మన్, కమిషనర్ కార్మికులతో మాట్లాడుతూ, రెండు రోజుల్లో రెండు నెలల వేతనాలు, నెలలోగా మిగిలిన పెండింగ్ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే మళ్లీ సమ్మెకు దిగుతామని వర్కర్ల యూనియన్ నాయకులు కృష్ణమూర్తి, వజీర్ మియాలు హెచ్చరించారు.