సాగర్ ప్రాజెక్టు పరిధిలోని కల్లూరు మండలంలో రావికంపాడు మైనర్ కాల్వ డ్రాప్ వద్ద బుధవారం గండి పడింది. దీనివల్ల సాగు నీరు వృథాగా పోతుండటంతో పాటు, వరద ప్రవాహం వల్ల డ్రాప్ కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరు అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నెస్పీ అధికారులు డ్రాప్ మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించామని, నీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.