ఖమ్మం: 200 కిలోల గంజాయి దహనం

1841చూసినవారు
ఖమ్మం: 200 కిలోల గంజాయి దహనం
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన, సీజ్ చేసిన 200 కిలోల ఎండు గంజాయిని అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాదరావు పర్యవేక్షణలో శనివారం తల్లాడ మండలం గోపాల్‌పేటలోని ఏడబ్ల్యూఎం కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో దహనం చేశారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 18 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నేరస్థులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గెజిట్ నోటిఫికేషన్ల ఆధారంగా పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ దహనం జరిగిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్