ఖమ్మం: సింగరేణి గనుల్లో ఘోర ప్రమాదం

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో జేవియర్ ఉపరితల గనుల్లో బొగ్గు రవాణా చేస్తున్న భారీ డంపర్ అదుపుతప్పి బొలెరో జీపుపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో జీపు పూర్తిగా నుజ్జు నుజ్జు కాగా, డ్రైవర్ ప్రభాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో అతన్ని సింగరేణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద దృశ్యాలను చిత్రీకరించడానికి వచ్చిన మీడియాను అధికారులు అడ్డుకుని బయటకు పంపించారు.
