సత్తుపల్లి మండలం తాళ్లమడ గ్రామ శివారులో శనివారం అర్ధరాత్రి లారీ ఢీకొని రైతు తుంబురు ఉమామహేశ్వర్ రెడ్డి (52) మృతి చెందారు. నారాయణపురం గ్రామానికి చెందిన ఉమామహేశ్వర్ రెడ్డి, పామాయిల్ గెలల లోడుతో ఫ్యాక్టరీకి వెళ్లి తిరిగి వస్తుండగా, తాళ్లమడ గ్రామ సమీపంలో ట్రాక్టర్కు డీజిల్ నింపుకుంటున్న సమయంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన, సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో నారాయణపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.