సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి శనివారం ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలను కలెక్టర్‌కు అందజేసిన ఎమ్మెల్యే, అక్కడి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ, అమలు తీరుపై చర్చించారు. ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలను కూడా ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ కూడా పాల్గొన్నారు.