రోజుల తరబడి భరించలేని వేడి, ఉక్కపోత, వడగాల్పులతో అల్లాడిన సత్తుపల్లి ప్రజలకు ఆదివారం కొంతమేర ఉపశమనం లభించింది. పట్టణంలో మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం తర్వాత ఉక్కపోత కొనసాగినా ఎండ ప్రభావం తక్కువగా ఉంది. కొద్దిపాటి వర్షంతో భూములు తడవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.