సత్తుపల్లి/వేంసూరులో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు ముమ్మరమయ్యాయి. శనివారం వేంసూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓ పరిమి రాజారావు సమక్షంలో అన్ని రాజకీయ పార్టీల నాయకుల మధ్య వార్డుల రిజర్వేషన్ల జాబితాను ఖరారు చేశారు. లాటరీ పద్ధతిలో జెండర్ ఎంపికలు జరిగాయి. ఈ ప్రక్రియలో తహశీల్దార్ మాణిక్ రావు, సీనియర్ అసిస్టెంట్ శాస్త్రి, జూనియర్ సహాయకులు శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, బీఆర్ఎస్, సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.