ఖమ్మం జిల్లా తల్లాడలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరిపై విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని వారు ఆకాంక్షించారు. నిమజ్జన కార్యక్రమాలను భక్తులందరూ సమన్వయంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ నాయకులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.