ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గణేష్ నవరాత్రుల సందర్భంగా మంగళవారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తల్లాడ, కల్లూరు ఖాన్ఖాన్పేట, పెనుబల్లి, సత్తుపల్లి పట్టణాల్లోని మండపాల్లో పూజలు, అన్నప్రసాద కార్యక్రమాల్లో భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు,
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.